Message: Return type of CI_Session_files_driver::open($save_path, $name) should either be compatible with SessionHandlerInterface::open(string $path, string $name): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::close() should either be compatible with SessionHandlerInterface::close(): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::read($session_id) should either be compatible with SessionHandlerInterface::read(string $id): string|false, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::write($session_id, $session_data) should either be compatible with SessionHandlerInterface::write(string $id, string $data): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::destroy($session_id) should either be compatible with SessionHandlerInterface::destroy(string $id): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::gc($maxlifetime) should either be compatible with SessionHandlerInterface::gc(int $max_lifetime): int|false, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
– దిగ్గజాల సరసన చేరిన హైదరాబాద్ సంస్థ
– మార్చికల్లా 250 ఎక్స్‌పీరియెన్స్ సెంటర్స్
– అక్టోబరుకల్లా 3 కొత్త ప్లాంట్లలో ఉత్పత్తి
– 22 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న కంపెనీ
– ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్ట్ 28: పెయింట్స్ తయారీ, విక్రయంలో ఉన్న టెక్నో పెయింట్స్ తాజాగా కలర్ బ్యాంక్స్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. భారత్‌లో 5–6 కంపెనీలు మాత్రమే ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయని సంస్థ తెలిపింది. కంపెనీ ప్రయాణంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని, దిగ్గజాల సరసన చేరామని టెక్నో పెయింట్స్ అభివర్ణించింది. కలర్ బ్యాంక్స్‌తో 3,000 పైచిలుకు రంగులను నిముషాల్లో కస్టమర్లకు అందించేందుకు వీలవుతుందని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌తో సైతం కలర్ బ్యాంక్స్‌ను ఆపరేట్ చేయగలిగేలా యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. తొలుత 1,000 మంది డీలర్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. బ్రాండ్ అంబాసిడర్‌గా సిటీ నటుడు మహేశ్ బాబు చేరికతో మారుమూల పల్లెలకూ కంపెనీ పాకిందన్నారు. కంపెనీ ఉత్పత్తులకు డీలర్ల నుంచి మంచి స్పందన ఉందని చెప్పారు.
ఎక్స్‌పీరియెన్స్ సెంటర్స్..
టెక్నో పెయింట్స్ 2023 ఆగస్ట్ 25 నాటికి 22 ఏళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇటీవలే మధ్యప్రదేశ్, ఒడిశాలో అడుగుపెట్టింది. 1,000 మంది డీలర్లు ఉన్నారు. 2024 మార్చికల్లా డీలర్ నెట్వర్క్ 3,000లకు చేరుతుందని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘2024 మార్చి నాటికి 250 ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను ప్రారంభిస్తున్నాం. వీటిలో 25 కేంద్రాలు ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కోటి రానున్నాయి. ఈ సెంటర్లలో కన్స్ట్రక్షన్ కెమికల్స్, వుడ్ ఫినిషెస్, స్పెషల్ ఫినిషెస్, పెయింటింగ్ టూల్స్, టైల్స్ అడిటివ్స్, పెయింట్స్, ఇతర ఉత్పత్తులను ప్రదర్శిస్తాం’ అని వివరించారు.
అక్టోబరుకల్లా ఉత్పత్తి..
కంపెనీ రూ.100 కోట్లతో కొత్తగా మూడు ప్లాంట్లను నిర్మిస్తోంది. తెలంగాణలో హైదరాబాద్ సమీపంలోని పాశమైలారం, చేరియాల్తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని నడికుడి వద్ద ఇవి ఏర్పాటవుతున్నాయి. అక్టోబరుకల్లా కొత్త కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ‘జర్మనీ నుంచి అత్యాధునిక మెషినరీ తెప్పిస్తున్నాం. నూతన ప్లాంట్ల చేరికతో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సాల్వెంట్ ఆధారిత పెయింట్స్ 36 లక్షల లీటర్లు, ఎమల్షన్ పెయింట్స్ 120 లక్షల లీటర్లు, పుట్టి 42,000 టన్నులకు చేరుతుంది. ఉత్పత్తులను వేగంగా కస్టమర్లకు చేర్చేందుకు ఇప్పటికే 25 డిపోలు ఏర్పాటయ్యాయి’ అని వివరించారు.